సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఆ రైతు కుటుంబాలకు రూ.3 లక్షల సాయం..

CM KCR: రైతుల పోరాటంపై కేంద్రం దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు సీఎం కేసీఆర్.

Arun Chilukuri
Published on: 20 Nov 2021 8:55 PM IST
Telangana Govt Announces Rs 3 Lakh Ex-gratia For Families of Farmers Who Lost Life
X

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఆ రైతు కుటుంబాలకు రూ.3 లక్షల సాయం..

CM KCR: రైతుల పోరాటంపై కేంద్రం దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు సీఎం కేసీఆర్. వ్యవసాయ సాగు చట్టాల కోసం చేసిన పోరాటంలో అమరులైనే రైతు కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి మూడు లక్షల చొప్పున ఆర్దిక సహాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అవసరమైతే తానే వెళ్లి స్వయంగా రైతు కుటుంబాలను కలిసి ఎక్స్ గ్రేషియా అంద చేస్తానని చెప్పారు.

రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లయినా కేంద్రం ఇంకా నీటి వాటాలు తేల్చలేదన్నారు సీఎం కేసీఆర్. కృష్ణా గోదావరిలో నీటి వాటాలను తేల్చేందుకు వెంటనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి నిర్దేశిత సమయంలో తేల్చాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చారించారు. నీటి పంపకాలపై ప్రదాని, కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తామని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story