Telangana: తెలంగాణలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ

Telangana: వ్యాక్సిన్‌ పంపిణీపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Updated on: 25 April 2021 7:00 AM IST
Telangana Govt Announces free Covid vaccine to ALL
X

Telangana: తెలంగాణలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ

Telangana: వ్యాక్సిన్‌ పంపిణీపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల ప్రాణాల కంటే డ‌బ్బు ముఖ్యం కాదు అని తేల్చిచెప్పారు. వ్యాక్సినేష‌న్ కోసం దాదాపు రూ. 2,500 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా వేశారు.

వ్యాక్సినేష‌న్ కోసం ఇప్ప‌టికే అధికారుల‌ను ఆదేశించామ‌ని సీఎం తెలిపారు. మరో రెండు రోజుల్లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించనున్న ఆయన.. జిల్లాల వారీగా ఇంచార్జీల నియామకంతో వ్యాక్సిన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story