Tamilisai: తెలంగాణ గవర్నర్‌ ‘ఎక్స్‌’ ఖాతా హ్యాక్‌.. ఐపీ అడ్రస్‌ల గుర్తింపు

Tamilisai: వివరాలు సేకరించాక నిందితులను పట్టుకుంటామన్న పోలీసులు

Shekhar G
Published on: 20 Jan 2024 10:18 AM IST
Telangana Governor Tamilisai X Account Hacked
X

Tamilisai: తెలంగాణ గవర్నర్‌ ‘ఎక్స్‌’ ఖాతా హ్యాక్‌.. ఐపీ అడ్రస్‌ల గుర్తింపు

Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నెల 14న గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో రాజ్‌భవన్‌ అధికారుల ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇండియాలోని మూడు ఐపీ అడ్రస్‌లు నుంచి ఆపరేట్ అయినట్లు గుర్తించారు. హాత్‌వే, యాక్ట్ సహా మరో ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా గవర్నర్ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా ఐపీ అడ్రస్ వివరాలు ఇవ్వాలంటూ సర్వీస్ ప్రొవైడర్లను పోలీసులు కోరారు. వివరాలు అందిన వెంటనే నిందితులను పట్టుకుంటామన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

Shekhar G

Shekhar G

Next Story