దూకుడు పెంచుతున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై.. అధికారులే టార్గెట్...

Tamilisai Soundararajan: వరంగల్ కాళోజీ మెడికల్ సీట్ల అక్రమాలపై సీరియస్...

Shireesha
Updated on: 22 April 2022 7:03 PM IST
Telangana Governor Tamilisai Soundararajan Targetted Govt Officials | Live News Today
X

దూకుడు పెంచుతున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై.. అధికారులే టార్గెట్...

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై దూకుడు పెంచారు. ప్రోటోకాల్ వివాదం నుంచి మొదలైన లొల్లి అంతకంతకూ పెరుగుతోంది. వరంగల్ కాళోజీ మెడికల్ సీట్ల అక్రమాలపై గవర్నర్ సీరియస్ అయ్యారు. మొత్తం వ్యవహారంపై రిపోర్ట్ ఇవ్వాలని వీసీని కోరారు. అంతే కాదు ఖమ్మం బీజేపీ నేత ఆత్మహత్య వ్యవహారం, రామాయంపేట దారుణ ఘటన, ఇవాళ జరిగిన ప్రేమోన్మాది ఘటనపైనా అధికారులను గవర్నర్ రిపోర్ట్ కోరారు.

గవర్నర్ దూకుడుతో తెలంగాణ సర్కారు అసహనంతో ఉంది. అయితే తనకున్న విచక్షణ అధికారాలను వినియోగించుకుంటున్నానంటూ గవర్నర్ తేల్చిచెబుతున్నారు. అధికార పార్టీకి పక్కలో బల్లెంలా గవర్నర్ మారారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీ పర్యటనల తర్వాత గవర్నర్ తమిళిసై స్పీడ్ పెంచినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవమానించాలని చూస్తే ఊరుకోనన్న సంకేతాలు పంపిస్తున్నారు తమిళిసై.


Shireesha

Shireesha

Next Story