తెలంగాణ గవర్నర్ తమిళిసై కు ప్రతిష్టాత్మక పురస్కారం

Arun Chilukuri
Published on: 4 March 2021 5:20 PM IST
Telangana Governor Tamilisai Soundararajan Gets Global Women of Excellence Award
X

తెలంగాణ గవర్నర్ తమిళిసై కు ప్రతిష్టాత్మక పురస్కారం

తెలంగాణ గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా తమిళి సై సౌందరరాజన్ కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలేన్స్ 2021 అవార్డుకు తమిళి సై ఎంపికయ్యారు. యూఎస్ కాంగ్రెస్ మ్యాన్ డానికే డేవిస్ మల్టీ ఎథిక్స్ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ వారిచే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు.

అలాగే అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమల హారిష్ తో పాటు వివిధ దేశాలకు చెందిన మరో 18 మంది మహిళలకు ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ వరించింది. ఈ అవార్డులు ఈనెల 7వ తేదీన అమెరికా నుండి వర్చువల్ పద్ధతిలో ప్రధానం చేస్తారు. సమాజ హితం కోసం అత్యున్నత సేవలు అందించినందుకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈ అంతర్జాతీయ ప్రతిష్టాత్మకంగా పురస్కారం లభించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story