ప్రవళిక సూసైడ్‌పై స్పందించిన గవర్నర్ తమిళిసై.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

Tamilisai Soundararajan: ప్రవళిక సూసైడ్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు.

Arun Chilukuri
Published on: 14 Oct 2023 1:01 PM IST
Telangana Governor Seeks Report on Pravalika Death
X

ప్రవళిక సూసైడ్‌పై స్పందించిన గవర్నర్ తమిళిసై.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

Tamilisai Soundararajan: ప్రవళిక సూసైడ్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. ప్రవళిక మృతి ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, TSPSC సెక్రటరీని ఆదేశించారు గవర్నర్. ప్రవళిక మృతిపై కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ప్రవళిక అకాల మరణం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఔత్సాహికులకు సవాళ్లు, ఒత్తిడిని గురిచేస్తుందని అన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న అమ్మాయి తన జీవితాన్ని కోల్పోయినందుకు విచారంగా ఉన్నప్పటికీ.. ఈ విషాద ఘటన ద్వారా లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు గవర్నర్ తమిళిసై తెలిపారు. నిరుద్యోగ యువత ఆశలు వదులుకోవద్దని, ఉపాధిని పొందే దిశగా ధైర్యం ప్రదర్శించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story