KTR: కేటీఆర్‌కు బిగ్‌షాక్.. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో కేటీఆర్‌ విచారణకు గవర్నర్‌ అనుమతి

KTR: ఫార్ములా ఈ-రేస్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో కేటీఆర్‌ విచారణకు తెలంగాణ గవర్నర్‌ అనుమతించారు.

Arun Chilukuri
Published on: 20 Nov 2025 11:19 AM IST
KTR: కేటీఆర్‌కు బిగ్‌షాక్.. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో కేటీఆర్‌ విచారణకు గవర్నర్‌ అనుమతి
X

KTR: కేటీఆర్‌కు బిగ్‌షాక్.. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో కేటీఆర్‌ విచారణకు గవర్నర్‌ అనుమతి

KTR: ఫార్ములా ఈ-రేస్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో కేటీఆర్‌ విచారణకు తెలంగాణ గవర్నర్‌ అనుమతించారు. ప్రజాప్రతినిధి కావడంతో కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్‌కు ఏసీబీ అధికారులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఫార్ములా ఈ-రేస్‌ లావాదేవీల విషయంలో కేటీఆర్‌పై అభియోగాలు ఉన్నాయి. 54 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలపై విచారణకు గవర్నర్‌ అనుమతిచ్చారు.

ఈ విచారణ అనంతరం కేటీఆర్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ, ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. రెండుసార్లు ఏసీబీ, ఒకసారి ఈడీ విచారణ ఎదుర్కొన్నారు కేటీఆర్. గత ఏడాది డిసెంబర్‌ 19న కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయగా.. సెప్టెంబర్‌ 9న గవర్నర్‌కు లేఖరాశారు ఏసీబీ అధికారులు. అయితే.. 70 రోజుల తర్వాత గవర్నర్‌ నుంచి కేటీఆర్‌ విచారణకు అనుమతి లభించింది. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో A1గా కేటీఆర్‌ ఉండగా.. A2గా అరవింద్‌కుమార్‌ ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story