Telangana: కేఆర్ఎంబీకి లేఖ రాసిన టీఎస్ ప్రభుత్వం

* శ్రీశైలం నుంచి ఏపీ నీరు తరలించకుండా నిలువరించాలని విజ్ఞప్తి

Sandeep Reddy
Published on: 22 Sept 2021 8:10 PM IST
Telangana Government Wrote Another Letter to the KRMB
X

కేఆర్ఎంబీ (ఫోటో: ది హన్స్ ఇండియా)

KRMB: కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీరు తరలించకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేసింది. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా నీటి తరలింపును నిలువరించాలని లేఖలో కోరింది. పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే 76.39 టీఎంసీలు, హంద్రీనీవా ద్వారా 9.28 టీఎంసీలు నీరు తరలించిందని లేఖలో పేర్కొంది. 1976 ఒప్పందం ప్రకారం ఏపీ 34 టీఎంసీల లోపే నీరు తీసుకోవాలని గుర్తు చేసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story