KRMB: కేఆర్ఎంబీకి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం
* సాగర్ కుడి, ఎడమ కాలువల సామర్థ్యాల్లో అసమానత ఉందని పేర్కొన్న తెలంగాణ ఈఎన్‌సి మురళిధర్
కేఆర్ఎంబీకి మరో లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం
KRMB: కేఆర్‌ఎంబి ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సి మురళిధర్ మరో లేఖ రాసారు. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల హెడ్ రెగ్యులేటర్ల విడుదల సామర్థ్యాల్లో అసమానత ఉందని ఈ అసమానతను సరిదిద్దాలని లేఖలో కోరారు. కాగా 510 అడుగుల వద్ద రెండు కాలువల విడుదల సామర్థ్యం సమానంగా ఉండాలని తెలిపారు.
ఏపీకి సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు ఇతర మార్గాల ద్వారా సాగు నీటి సరఫరాకు అవకాశం ఉన్నందున వారు కృష్ణ నీటిని బేసిన్‌లో ఉన్న తెలంగాణకు వదిలేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్‌ను కోరారు.
Next Story




