Telangana: తుంగభద్ర బోర్డు సెక్రటరీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

*RDS ఆధునీకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి.. *ఏపీ అటు తుంగభద్ర నీరు, ఇటు కృష్ణా నీరు వాడేస్తోంది

Shilpa
Published on: 5 Oct 2021 4:24 PM IST
Telangana Government wrote a Letter to Tungabhadra Board Secretary
X

తుంగభద్ర బోర్డు సెక్రటరీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ(ఫైల్ ఫోటో)

Telangana: తుంగ భద్ర బోర్డు సెక్రటరీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ ఎడాపెడా వాడేస్తున్న నీటి వల్ల ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు రావల్సిన వాటా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. తుంగభద్ర లో తమ వాటా సంపూర్ణంగా దక్కాలంటే ఆర్డీఎస్ ని సాధ్యమైనంత వేగంగా, త్వరగా పూర్తి చేయాలని కోరింది.

తుంగభద్ర నుంచి ఆర్డీఎస్ ద్వారా 15 టీఎంసీలు దక్కాల్సి ఉండగా కేవలం 5 లేక 6 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయని ఆరోపించింది. ఏపీ ఇటు తుంగభద్ర నీరు, అటు కృష్ణా నీటిని కూడా వినియోగించుకుంటోందని ఆర్డీఎస్ పూర్తి చేసి త్వరగా నీటిని పూర్తి స్థాయిలో అందిస్తే తప్ప తెలంగాణ కు న్యాయం జరగదని వ్యాఖ్యానించింది.

Shilpa

Shilpa

Next Story