DHO - Omicron Cases: అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మొద్దు

Telangana government Will Announce if Covid Variant Omicron Cases Reported Shortly Says by DHO Srinivas Rao
x

మంత్రివర్గ సమావేశంలో ఒమిక్రాన్‌పై సమగ్రంగా చర్చ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Highlights

భారత్‌లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ సంక్రమించలేదు : డీహెచ్‌ఓ

DHO - Omicron Cases: తెలంగాణ మంత్రి వర్గ సమావేశం లో కోవిడ్ కొత్త వెరీయాంట్ ఒమిక్రాన్‌పై సమగ్రంగా చర్చించినట్లు డీహెచ్‌ఓ శ్రీనివాస్‌‌రావు తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ సంక్రమించలేదని. ఒకవేళ కొత్త కేసులు బయట పడితే ప్రభుత్వమే నేరుగా ప్రకటిస్తుందని. ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మొద్దని డీహెచ్‌ఓ విజ్ఞప్తి చేసారు. 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈరోజు అర్ధరాత్రి నుంచి విదేశాల నుంచి వచ్చేవారికి తప్పక టెస్ట్‌లు చేస్తామని వివరించారు.

పాజిటివ్ వచ్చిన వారిని టిమ్స్ అసపత్రికి తరలించి చికిత్సను అందిస్తారు. నిన్న 12 దేశాల నుంచి 40 మందికి పైగా వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటీవ్‌ నిర్ధారణ ఐనందున హోమ్ క్వరంటయిన్‌కి పంపినట్లు తెలిపిన డీహెచ్‌ఓ వారి ఆరోగ్యాన్ని 14 రోజులపాటు గమనిస్తామని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories