IAS Transfers: తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌ల బదిలీ

IAS Transfers: తెలంగాణ ప్రభుత్వం 11 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది.

Shekhar G
Updated on: 17 Dec 2023 6:48 PM IST
Telangana Government Transfers 11 Ias Officers
X

IAS Transfers: తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌ల బదిలీ

IAS Transfers: తెలంగాణలో నూతనంగా అధికారం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు చేస్తోంది. తాజాగా, 11 మంది సీనియర్ ఐఏఎస్‌ అధికారులను ఇతర పోస్టులకు బదిలీ చేసింది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ, హైదరాబాద్ వాటర్ వర్క్స్‌ ఎండీగా సుదర్శన్‌రెడ్డి, ఆర్‌అండ్‌బి ముఖ్య కార్యదర్శిగా శ్రీనివాస్‌ రాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఆర్‌వీ కర్ణన్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా అరవింద్‌ కుమార్‌, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌గా శ్రీదేవి, అటవిశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్, మెడికల్&ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యదర్శిగా క్రిస్టియానా, జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జలను నియమిస్తూ.. సీఎస్ శాంతికుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story