నేటి నుంచి హైదరాబాద్ లో ఉచిత కరోనా పరీక్షలు.. ఏర్పాట్లు చేసిన తెలంగాణా ప్రభుత్వం

నేటి నుంచి హైదరాబాద్ లో ఉచిత కరోనా పరీక్షలు.. ఏర్పాట్లు చేసిన తెలంగాణా ప్రభుత్వం
x
Highlights

రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముందుగా పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇంతవరకు నామ మాత్రంగా పరీక్షలు...

రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముందుగా పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇంతవరకు నామ మాత్రంగా పరీక్షలు చేస్తున్నట్టు పలువురు ఆరోపించడం, పూర్తి స్థాయిలో దీనిని కట్టడి చేసేందుకు టెస్ట్ లు చేయడం ఒక్కటే మార్గమని భావించిన ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. హైదరాబాదులో దాదాపుగా 50వేల మందికి ఈ పరీక్షలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్ నగరంలో కోవిడ్-19 భారీగా విజృభిస్తోంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ వైరస్‌ కట్టడికి ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌ పరిసరాల్లో 50 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు (మంగళవారం) ఇవాళ్టి నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎంపిక చేసిన వనస్థలిపురం, బాలాపూర్‌, కొండాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబ సభ్యులు, కాంటాక్ట్‌ అయిన వారికి తొలి ప్రాధాన్యతగాా కొవిడ్-19 పరీక్షలు చేయనున్నారు.

ఒక్కో కేంద్రంలో రోజుకు 150 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే మొదటి దఫాలో ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ టెస్టులను ప్రారంభించనున్నారు. ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో వీటిని పెంచే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. త్వరలో ఫీవర్‌, కింగ్‌కోఠి, చెస్ట్‌, సరోజినీ ఆస్పత్రుల్లో కూడా కొవిడ్-19 పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories