ముగిసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి పదవీ కాలం.. ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ

అయితే పార్ధసారథి పదవీకాలాన్ని పొడిగిస్తారా..? లేక ఆ స్థానంలో కొత్త వారిని నియమిస్తారా..? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Sept 2024 11:14 AM IST
Telangana Government To Appoint New State Election Commission
X

ముగిసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి పదవీ కాలం.. ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ

Telangana State Election Commissioner: తెలంగాణలో ఎన్నికల కమిషనర్ పోస్ట్ ఖాళీ అయ్యింది. తన పదవీకాలం ముగియడంతో పార్ధసారథి ఎస్‌ఈసీ కార్యాలయానికి రాలేదు. అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని పొలిటికల్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా తన పదవీ కాలాన్ని మరోఏడాది పాటు పొడిగించాలని పార్ధసారథి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2020 సెప్టెంబర్ 9న ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టారు. 2023 సెప్టెంబర్‌ 8తో పార్ధసారథి పదవీకాలం పూర్తి చేసుకున్నారు.

అయితే పార్ధసారథి పదవీకాలాన్ని పొడిగిస్తారా..? లేక ఆ స్థానంలో కొత్త వారిని నియమిస్తారా..? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎస్‌ఈసీ పదవీ కోసం పలువురు రిటైర్డ్‌, సీనియర్ ఐఏఎస్‌లు లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story