Telangana: డ్రగ్స్‌ కట్టడిపై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్

Telangana Government special focus on drugs
x

Telangana: డ్రగ్స్‌ కట్టడిపై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్  

Highlights

Telangana: డ్రగ్స్‌ విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని పోలీసుల హెచ్చరిక

Telangana: మత్తరహిత హైదరాబాద్‌గా నగరాన్ని తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. హైదరాబాద్‌లో డ్రగ్స్ అన్న పదం వినిపించకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్స్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు. పబ్బులపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. పబ్స్ పై పోలీసులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్స్ లో పబ్ లపై నిఘా వేసి తనిఖీలు చేస్తున్నారు.

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాగూడలో గల ది కేవ్ పబ్ లో టీఎస్ న్యాబ్, సైబరాబాద్ ఎస్ఓటి, రాయదుర్గం పోలిసులు సంయుక్తంగా తనిఖీలు జరపగా డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. పబ్ లోని దాదాపు 50 మందికి టెస్టు చేయగా... 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ కావడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పీఎస్ కు తరలించారు.

ఈ 24 మందికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు పోలీసులు. రిపోర్టుల ఆధారంగా వీరిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. డ్రగ్స్ సేవించిన వారితో పాటు పబ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు రాయదుర్గం సీఐ వెంకన్న తెలిపారు. వీకెండ్ కావడంతో స్పెషల్ ఈవెంట్ నిర్వహించినట్లు సీఐ తెలిపారు. ఈవెంట్ ఆర్గనైజేర్లపై చర్యలు తీసుకుంటమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories