Telangana: తెలంగాణ రాష్ట్రానికి మరో టెక్స్ టైల్ పరిశ్రమ

Telangana Government Signed an MoU with Gokaldas
x

Telangana: తెలంగాణ రాష్ట్రానికి మరో టెక్స్ టైల్ పరిశ్రమ

Highlights

Telangana: తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో టెక్స్‌టైల్ పరిశ్రమ ముందుకొచ్చింది.

Telangana: తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో టెక్స్‌టైల్ పరిశ్రమ ముందుకొచ్చింది. ప్రముఖ టెక్స్‌టైల్స్ కంపెనీ గోకల్ దాస్ తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే సిరిసిల్లలో సుమారు 65 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న అప్పారెల్ పార్కులో ఈ కంపెనీ తన కార్యకలాపాలను కొనసాగించనుంది. గోకల్ దాస్ కంపెనీ ద్వరా ప్రత్యక్షంగా 11 వందల మందికి ఉద్యోగాలు వస్తాయని గోకల్ దాస్ మేనేజింగ్ డైరెక్టర్ సుమిర్ తెలిపారు.

గోకల్ దాస్ కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు రావడం పట్ల తెలంగాణ టెక్స్ టైల్ శాఖ మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే టెక్స్ టైల్ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం తన ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా ఉంచి అనేక కార్యక్రమాలను చేపడుతోందని, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు శిక్షణ కార్యక్రమాలను సైతం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories