తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు, మద్దతు ధర

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు, మద్దతు ధర
x
Highlights

రైతు కష్టం లాభంగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ యాక్షన్ ప్లాన్‌ రెడీ చేశారు. రైతులు మార్పుకు సిద్ధపడితే చాలు వ్యవసాయ రూపురేఖలే మారనున్నాయి. 24 గంటల ఉచిత...

రైతు కష్టం లాభంగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ యాక్షన్ ప్లాన్‌ రెడీ చేశారు. రైతులు మార్పుకు సిద్ధపడితే చాలు వ్యవసాయ రూపురేఖలే మారనున్నాయి. 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రుణ మాఫీలతో వ్యవసాయం మినిమమ్‌ గ్యారెంటీగా మారిన తరుణంతో మరింత లాభాలు పొందేలా ప్రణాళిలు సిద్ధం అవుతున్నాయి. అలాగని అందరూ ఒకే రకం పంటే వేస్తూ పోతే...? తినేదెందరు? కొనేదెవ్వరు?అన్న ఆలోచనతో మొదలైన ప్రయత్నం పంటలను మార్చాలని నిర్ణయించారు. ప్రభుత్వం తెస్తున్న ఆ మార్పులేంటో ఓ సారి చూద్దాం.

తెలంగాణలో వ్యవసాయ రంగం తలరాతను మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు రైతు జీవితాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు భారీ మార్పునకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు పంటలు సాగు చేయాలని నిర్దేశించారు. అప్పుడు మాత్రమే ప్రభుత్వం, రైతులు పడుతున్న కష్టానికి తగిన ఫలితం లభిస్తుందన్నారు. మారుతున్న వాతావరణంలో కొంచం కష్టమే అయినా అయిష్టమే అయినా మార్పుకు అందరు సహకరించాలని కోరుతున్నారు.

ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతు బంధు ఇస్తామని సీఎం కేసీఆర్‌ మరోసారి కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు. పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై సమీక్షించిన ఆయన చెప్పిన పంటలు వేస్తేనే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామన్నారు. అందరూ ఒకే పంట వేసే విధానం పోవాలని కేవలం డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాలని తెలిపారు.

ఈ వర్షాకాలంలో 50 లక్షల ఎకరాల్లో వరి, 10 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా తో పాటు మరో 10 లక్షల ఎకరాల్లో పత్తి, కందులు పట్టణ ప్రాంతాలకు సమీపంలో కూరగాయల సాగు చేయించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే లభ్యమయ్యేలా విత్తన నియంత్రణ అథారిటీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు.

రైతుల ఆలోచనలో నిర్మాణాత్మకమైన మార్పులు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఎవరిష్టం వచ్చినట్లు పంటలు వేసి మార్కెట్‌కు తీసుకురావొద్దన్నారు. ఏ ప్రాంతంలో ఏ రైతులు ఏ రకం పండించాలి? ఎంత విస్తీర్ణంలో పండించాలి? అనే విషయాలను త్వరలోనే ప్రభుత్వం వెల్లడిస్తుందన్న కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతు బంధు ఇవ్వాలని ఆ పంటలకే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలనే నిర్ణయించారు.

నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధానంపై చర్చించేందుకు, తగు సూచనలు చేసేందుకు ఈ నెల 15న క్షేత్ర స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి, ఎడిఎ, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారి ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొని సలహాలు,సూచనలు చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories