కరోనా వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం : సీఎం కేసీఆర్

కరోనా వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం : సీఎం కేసీఆర్
x
Highlights

Covid Vaccine Distribution in Telangana : కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్ రావాల్సిన...

Covid Vaccine Distribution in Telangana : కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ర్టాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా అంశంపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు వ్యాక్సిన్ ను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ చెప్పారు. ఇందుకు అనుగణమైన కార్యాచరణ రూపొందించామన్నారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావఱణ పరిస్థుతులు ఉన్నాయని వ్యాక్సిన్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంత మందికి ఇవ్వాలని ఆ తర్వాత 15 రోజులు పరిస్థితిని పరిశీలించి మిగతా వారికి ఇవ్వాలని కేసీఆర్ సూచించారు.

ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సీఎం కేసీఆర్ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ ను సరఫరా చేసేందుకు అవసరమైన కోల్డ్ చైన్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీలుగా ఏర్పడి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. మొదట ఆరోగ్య కార్యకర్తలకు, కోవిడ్ పై ముందుండి పోరాడుతున్న పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి, అరవై ఏళ్ళు దాటిన వారికి, తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పారు. దీని కోసం జాబితాను రూపొందించాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories