Telangana: తెలంగాణలో మాస్క్ తప్పనిసరి

Telangana Government Orders to Impose 1000 Rupees Fine if not Wearing Mask
x

ఫైల్ ఫోటో 

Highlights

Telangana: మాస్క్‌ పెట్టుకోకపోతే 1000 రూపాయల ఫైన్‌ * అయినా వినకపోతే కేసులు నమోదు

Telangana: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజుకు లక్షన్నర పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో.. మాస్క్ తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, సభలు, సమావేశాల్లో.. పనిచేస్తున్న కార్యాలయాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. మాస్క్ పెట్టుకోకపోతే.. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఐపీసీ సెక్షన్ 188 కింద వెయ్యి రూపాయల ఫైన్ కట్టాల్సిందేనని చెప్పింది సర్కార్. ఇంటి నుంచి బయటకు వస్తే.. ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాల్సిందేనని సూచించింది.

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా కట్టడిలో భాగంగా ఇక నుంచి బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్‌ ధరించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. మాస్క్‌ ధరించకపోతే 1000 రూపాయల జరిమానా విధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలని డీజీపీ, కలెక్టర్లు, పోలీసులు, ఉన్నతాధికారులకు సూచించింది.

మాస్క్‌ పెట్టుకోని వారిపై పోలీసులు నిఘా విస్తృతం చేశారు. స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా ఉల్లంఘనల్ని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. మెయిన్‌ సర్కిళ్లల్లో సీసీ కెమెరాలకు ఈ సాంకేతికతను అనుసంధానం చేయడంతో మాస్క్‌ ధరించని వారెవరో సులభంగా తెలిసిపోతుంది. అనంతరం సమీపంలోని పోలీసులను అలర్ట్‌ చేస్తుండటంతో వారు వెంటనే అక్కడికి చేరుకొని కేసులు నమోదు చేస్తున్నారు.

ఈనెల 5 నుంచి ఆదివారం ఉదయం 10.50 గంటల వరకు 6వేల, 478 కేసులు నమోదు చేశారు. వీటిలో హైదరాబాద్‌ కమిషనరేట్‌లో అత్యధికంగా 2వేల, 30 కేసులు నమోదయ్యాయి. రామగుండం కమిషనరేట్‌లో 938, రాచకొండ 670, సైబరాబాద్‌ 514, సంగారెడ్డి 349, కామారెడ్డి 272, సూర్యాపేట 257, వరంగల్‌లో 218 నమోదు చేశారు. వనపర్తి, భూపాలపల్లి, జగిత్యాలల్లో ఒక్కోటి నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసూ నమోదవ్వలేదు. కేసులు నమోదైన వారు కోర్టుల్లో వెయ్యి రూపాయల ఫైన్‌ చెల్లించాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories