CM KCR Political Plan: రాజకీయాల్లోకి ప్రభుత్వ అధికారులు..?

Telangana Government Officials Into Politics
x

CM KCR Political Plan: రాజకీయాల్లోకి ప్రభుత్వ అధికారులు..?

Highlights

CM KCR Political Plan: మూడోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

CM KCR Political Plan: మూడోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది కారు పార్టీ. దాంట్లో భాగంగా ఈసారి ఆఫీసర్లను బరిలోకి దించేయోచనలో అధికార పార్టీ ఉంది. ఎన్నికల నాటికి పూర్తిగా పరిస్థితులు మరకపోయిన సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తారన్న నమ్మకంలో ఇప్పుడు కొందరు అధికారులు ఉన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి ఖమ్మం జిల్లా నుండి ఎదో ఒక నియోజకవర్గం నుండి బరిలోకి దిగాలని భావిస్తున్నారట. 2018 ఏప్రిల్ 10న పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన డిసెంబర్ 31, 2023లో ఆయన పదవి కాలం ముగియనుంది. ఆయనను అసెంబ్లీకి పంపే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

మరో అధికారి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాసరావు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చర్చ ఉంది. ఉద్యోగ సంఘాల నాయకులు మామిళ్ల రాజేందర్ సైతం మెదక్ నుండి తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రెడీ అవుతున్నారట. అదే విధంగా నిజామాబాద్ సీపీ నాగరాజు ఇప్పటికే తన మనసులో మాట వెలిబుచ్చారు. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగేందుకు రెడీ అవుతున్నట్లు తెలిపారు. ఇదే బాటలో హైదరాబాద్ కలెక్టర్ గా పని చేస్తున్న శర్మన్ రాజకీయాలోకి రావాలని భావిస్తున్నారట. జలమండలి ఎండీ దానకిషోర్ సైతం రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయ్.


Show Full Article
Print Article
Next Story
More Stories