Telangana Government: భూముల అమ్మకానికి నోటిఫికేషన్

Telangana Government: నిధుల సమీకరణలో భాగంగా అత్యవసర ప్రజాపయోగ అవసరాల్లేని, విలువైన ప్రాంతాల్లో ఆక్రమణలకు అవకాశమున్న ప్రభుత్వ భూములను అమ్మాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.

Arun Chilukuri
Updated on: 12 Jun 2021 6:00 PM IST
Telangana Government Notification for Sale of Lands
X

Telangana Government: భూముల అమ్మకానికి నోటిఫికేషన్

Telangana Government: నిధుల సమీకరణలో భాగంగా అత్యవసర ప్రజాపయోగ అవసరాల్లేని, విలువైన ప్రాంతాల్లో ఆక్రమణలకు అవకాశమున్న ప్రభుత్వ భూములను అమ్మాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. భూముల అమ్మకానికి సంబంధించి ఈనెల 15న నోటిఫికేషన్ జారీ చేయనుంది. 25న ప్రీబిడ్ సమావేశం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూలై 13న రిజిస్ట్రేషన్‌కు చివరి తేది అని 15వ తేదీన ఈవేలం నిర్వహించనున్నట్టు వివరించింది. భూముల విక్రయాల్లో భాగంగా కోకాపేటలో 49.95 ఎకరాలు, ఖానామెట్‌లోని 15.1 ఎకరాలను ప్లాట్లుగా విక్రయించనున్నారు. కోకాపేట భూముల వేలం ప్రక్రియను హెచ్‌ఎండీఏ, ఖానామెట్‌ భూముల వేలం ప్రక్రియను టీఎస్‌ఐఐసీ నిర్వహించనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story