వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలి: సీఎస్

X
Highlights
కొత్త రెవెన్యూ చట్టం దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. వీఆర్వో వ్యవస్థ రద్దుకు...
Arun Chilukuri7 Sep 2020 5:51 AM GMT
కొత్త రెవెన్యూ చట్టం దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. వీఆర్వో వ్యవస్థ రద్దుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 12 గంటలలోగా రికార్డులను కలెక్టరేట్‌లో అప్పగించాలని వీఆర్వోలకు స్పష్టంచేసింది. రికార్డుల సేకరణ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తికావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ల నుంచి సాయంత్రంలోగా సమగ్ర నివేదిక రావాలని ఆదేశించారు. రెవెన్యూ చట్టానికి సంబంధించిన ముసాయిదా బిల్లును ఇవాళ్టి నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో పెట్టే అవకాశముంది.
Web Titletelangana government may cancel VRO system ?
Next Story