TS Dharani: ధరణి వెబ్‌సైట్‌లో భారీ మార్పులకు టీఎస్‌ ప్రభుత్వం సిద్ధం

* నిషేధిత భూముల తొలగింపు, కొత్త మాడ్యూల్స్‌తో సమస్యల పరిష్కారం * నిషేధిత జాబితాలోకి వెళ్లిన లక్షల ఎకరాల భూములు

Shilpa
Published on: 26 Nov 2021 5:44 PM IST
Telangana Government is Preparing for Major Changes in the Dharani Website
X

ధరణి వెబ్‌సైట్‌లో భారీ మార్పులకు టీఎస్‌ ప్రభుత్వం సిద్ధం(ఫైల్ ఫోటో)

TS Dharani: ధరణి వెబ్‌సైట్‌లో భారీ మార్పులకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. నిషేధిత భూముల తొలగింపు, కొత్త మాడ్యూల్స్‌తో సమస్యల పరిష్కారానికి ప్లాన్‌ చేస్తోంది. ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత నిషేధిత జాబితాలోకి లక్షల ఎకరాల భూములు వెళ్లినట్టు తెలుస్తోంది.

దీంతో వారం రోజుల్లో ధరణి నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించే ప్రక్రియ చేపడుతోంది. మరోవైపు వ్యవసాయ భూమిలో ఇళ్లు కట్టుకుంటే రైతు బంధు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ధరణిలో రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి చెల్లించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కలెక్టర్‌ ఆఫీస్‌ల చుట్టూ వేలాది మంది రైతులు తిరుగుతున్న నేపథ్యంలో రైతుల విన్నపాలు సుమోటోగా స్వీకరించి పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

Shilpa

Shilpa

Next Story