Telangana: రూ.50వేల లోపు రుణాలన్నీ మాఫీ చేయనున్న ప్రభుత్వం

* ఈ నెల 16 నుంచి రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం * కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు మంత్రి హరీష్‌రావు ఆదేశం

Sandeep Reddy
Published on: 7 Aug 2021 6:59 AM IST
Telangana Government is Preparing For Debit Waiver of Farmers From 16 August 2021
X

హరీష్ రావు సమావేశం(ఫైల్ ఫోటో)

Telangana: ప్రభుత్వం రైతుల రుణమాఫీకి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 16 నుంచి రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తాలను జమ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఆరు లక్షల మంది రైతు ఖాతాల్లోకి 2006 కోట్ల రుణ మాఫీ డబ్బులు జమ చేస్తామన్నారు. 50వేల లోపు రుణాలన్నీ మాఫీచేయనున్నట్టు తెలిపారు. బ్యాంకర్లు రుణ మాఫీ మొత్తాన్ని ఏ ఇతర ఖాతా కింద జమ చేయవద్దని అన్నారు. పూర్తిగా రుణాల మాఫీ ఖాతాలోనే జమ చేయాలని ఆదేశించారు. రుణ మాఫీ జరిగిన రైతుల అక్కౌంట్‌ జీరో చేసి కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story