ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కార్

*ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించిన తెలంగాణ హైకోర్టు

Jyothi
Published on: 7 Feb 2023 6:47 PM IST
Telangana Government has approached the Supreme Court on the MLA Purchase Case
X

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కార్

Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలంటూ సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనాన్ని సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. సీబీఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలన్నీ ధ్వంసమవుతాయని.. దుష్యంత్ దవే ఆందోళన వెలిబుచ్చారు. రేపు ధర్మాసనం దృష్టికి తీసుకొస్తే వచ్చే వారం విచారణకు అనుమతిస్తామని.. రేపు మెన్షన్ చేయకపోయినా వచ్చే వారం విచారణకు వస్తుందన్నారు సీజేఐ.

Jyothi

Jyothi

Next Story