Residence to Colonel Santosh Babu Family: కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి నివాస స్థలం అప్పగింత.. విలువ ఎంతంటే?

Arun Chilukuri
Published on: 22 July 2020 2:07 PM IST
Residence to Colonel Santosh Babu Family: కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి నివాస స్థలం అప్పగింత.. విలువ ఎంతంటే?
X

Residence to Colonel Santosh Babu Family: చైనా సరిహద్దులో పోరాడుతూ అమరుడైన సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల చెక్కు రూపంలో నగదు అందజేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఇంటి స్థలం కూడా అందించబోతోంది. షేక్‌పేట్ మండలంలో మూడు స్థలాల్లో ఇష్టం వచ్చిన స్థలాన్ని ఎంచుకోవాలని అమర సైనికుడి కుటుంబానికి సర్కారు సూచించింది. సంతోష్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు బంజారాహిల్స్ లో స్థలం కేటాయించారు.

బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 14లో కేబీఆర్‌ పార్క్‌కు ఎదురుగా ఉన్న రూ. 20 కోట్ల విలువైన 711 గజాల స్థలాన్ని సంతోష్‌ బాబు కుటుంబానికి కేటాయించారు. బుధవారం ఉదయం ఆ స్థలాన్ని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి పరిశీలించారు. ఆ తర్వాత స్థలానికి సంబంధించిన పత్రాలను సంతోష్‌ భార్యకు కలెక్టర్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story