Zoo Parks: నేటి నుంచి తెరుచుకోనున్న జూపార్కులు

Zoo Parks: కరోనా ఎఫెక్ట్‌ తగ్గడంతో తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ * కరోనా నిబంధనలు పాటిస్తూ సందర్శకులకు అనుమతి

Sandeep Eggoju
Updated on: 11 July 2021 6:50 PM IST
Telangana Government Green Signal to Open Zoo Parks
X
తెలంగాణాలో తెరుచుకోనున్న జూ పార్కులు (ఫైల్ ఇమేజ్)

Zoo Parks: ఇన్నాళ్లు మూతబడిన జూపార్కులు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా ఎఫెక్ట్‌ తగ్గిపోవడంతో జూలను తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటితోపాటు జింకల పార్కులు, జాతీయ ఉద్యానవనాలు కూడా తెరచుకోనున్నాయి. ఈ రోజు నుంచి కరోనా నిబంధనలు పాటిస్తూ సందర్శకులను అనుమతించనున్నారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్‌ కూడా తిరిగి తెరుచుకోనుంది. ఉదయం 8.30 గంటలకు జూ పార్క్​ను పునఃప్రారంభంకానుంది. అయితే సందర్శనకు వచ్చే వారికి పలు మార్గదర్శకాలను జూ అధికారులు విడుదల చేశారు. తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story