Telangana: కారులో కూర్చోని సినిమా చూసేయొచ్చు

Telangana Government Exercise to Set up an Open Theater
x

ఓపెన్ థియేటర్ ఏర్పాటుకు టీ.సర్కార్ కసరత్తు

Highlights

Telangana: ఓపెన్ థియేటర్ ఏర్పాటుకు టీ.సర్కార్ కసరత్తు

Telangana: ఇప్పటి వరకు డ్రైవ్ ఇన్ ఫుడ్ రెస్టారెంట్స్ చూశాం.. ఇక డ్రైవ్ ఇన్ థియేటర్స్ రాబోతున్నాయి. డ్రైవ్ ఇన్ థియేటర్స్ ఎక్స్‌పీరియన్స్ నగరవాసులకు కలుగబోతోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం , హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాచరణ రెడీ చేస్తున్నాయి.

సాధారణంగా సినిమా థియేటర్‌కు , మల్టీఫ్లెక్స్ వెళితే ముందుగా వాహనం పార్కు చేయాలి. తర్వాత టికెట్ తీసుకుని క్లోల్జ్ హాల్‌లో అక్కడున్న సీట్లో కూర్చోని సినిమా చూడాలి. కానీ డ్రైవ్ ఇన్ థియేటర్‌లో మనం కారులో కూర్చోని ఎదురుగా కనిపించే అతి భారీ స్క్రీన్‌పై సినిమా చూడవచ్చు. ఈ ఓపెన్ థియేటర్‌కు తగ్గట్టు సౌండ్ సిస్టమ్ ఉంటుంది.

యూరప్ , అమెరికా దేశాల్లో డ్రైవ్ ఇన్ థియేటర్ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నైలలో డ్రైవ్ ఇన్ థియేటర్లు ఉన్నాయి. కనీసం 150 కార్ల సామర్థ్యంతో డ్రైవ్ ఇన్ థియేటర్ ఏర్పాటు చేయాలంటే కనీసం 5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. 150 కార్లు సులువుగా వచ్చిపోయేలా, నిలిపిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. వీటి ఏర్పాటుకు సువిశాల స్థలం కావాలి. నగరం మధ్యలో లొకేషన్ కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.

భాగ్యనగరం నలువైపులా విస్తరిస్తూ ఓఆర్ఆర్ రూపుదిద్దుకుంది. 19ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ పాయింట్ల సమీపంలో ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను అందుబాటులోకి తెస్తే ఎలా ఉంటుందనే అంశంపై హెచ్‌ఎండీఏ పరిశీలిస్తోంది. డ్రైవ్ ఇన్ థియేటర్ వస్తే ఈ ఫెసిలిటి ఉన్న అతికొద్ది నగరాల జాబితాలో హైదరాబాద్ చేరుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories