Top
logo

నర్సింగ్ చదువుకు ఇక సెలవే!

నర్సింగ్ చదువుకు ఇక సెలవే!
Highlights

జీఎన్ఎం కోర్సులను నిలిపివేయాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిర్ణయం మేరకు 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను నిలిపేస్తామని ప్రకటించింది.

నర్సింగ్ చదువుకోవాలనుకునే వారికి ఇక పై ఆ అవకాశం ఉండదు. తెలంగాణ ప్రభుత్వం 2021-22 విద్యా సంవత్సరం నుంచి జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) కోర్సు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 138 ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్‌ స్కూళ్లల్లో 6 వేలకు పైగా జీఎన్‌ఎం సీట్లు ఉన్నాయి. ఇన్ని వేల సీట్లను ఒకేసారి రద్దు చేస్తుండటంతో నర్సింగ్‌ విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. చాలా రాష్ట్రాల్లో జీఎన్‌ఎం కోర్సు రద్దు చేసినా, వాటి స్థానే బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు నిర్వహించేందుకు అనుమతించారు. దీంతో జీఎన్‌ఎం సీట్లు పోయినా బీఎస్సీ నర్సింగ్‌ సీట్లు వచ్చాయి. కానీ తెలంగాణ లో ఇప్పటివరకూ ఆ దిశగా చర్యలు ప్రారంభించలేదు.

సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జీఎన్ఎం అర్హత కలిగిన నర్సులే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే, బీఎస్సీ నర్సింగ్ వారికంటే..వీరు తక్కువ వేతనాలకు పని చేస్తారు. ఇదే విషయాన్ని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. డీఎంఈ పరిధిలోకి ఈ జీఎన్ఎం కోర్సులు వస్తాయి. ఇవి డిప్లమా కోర్సులుగా ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారితో పోలిస్తే, జీఎన్ఎం కోర్సులు చేసిన వారిలో నైపుణ్యం తక్కువ ఉంటోందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కోర్సును రద్దు చేయాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ కాలేజీల్లో 5 వేల లోపు సీట్లు మాత్రమె బీఎస్సీ నర్సింగ్ లో ఉన్నాయి. దీంతో ఇందులో సీటు దొరకని వారు జీఎన్ఎం వైపు వచ్చేవారు. ఇప్పుడు ఈ కోర్సు తీసివేస్తుండడం తో నర్సింగ్ విద్య అభ్యసించాలనుకునే వారికి అవకాశాలు తగ్గిపోనున్నాయి. దీనికి ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన అవసరం ఉంది. ఈ నేపధ్యంలో జీఎన్ఎం కోర్సులు అందిస్తున్న స్కూళ్లను కాలేజీలుగా అభివృద్ధి చేయాలని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోరుతోంది.

Web TitleTelangana Government decided to close GNM course as per Indian Nursing Council demand
Next Story