కేజీఎఫ్ సినిమా టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

*సినిమా విడుదల తేదీ నుంచి నాలుగు రోజులపాటు ధరలు పెంచుకునే ఛాన్స్

Rama Rao
Published on: 12 April 2022 8:40 PM IST
Telangana Government Approves Increase in KGF Movie Ticket Rates
X

కేజీఎఫ్ సినిమా టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

KGF-2 Ticket Price: కేజీఎఫ్ సినిమా టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్, ఐమాక్స్ థియేటర్స్ లో రూ. 50చొప్పున పెంచుకునేందుకు వెసలుబాటు కల్పించింది తెలంగాణ సర్కార్. సాధారణ ఎయిర్ కండిషన్, ఎయిర్ కూల్ థియేటర్లలో రూ. 30 చొప్పున టికెట్ల ధరలను పెంచుకునే అవకాశం కల్పించింది. సినిమా విడుదల తేదీ నుంచి నాలుగు రోజులపాటు ధరలు పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది. అలాగే నాలుగు రోజుల పాటు ఐదో షోకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Rama Rao

Rama Rao

Next Story