Telangana: కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్

Telangana: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను కుదించే ఆలోచన * ఇవాళ బీఏసీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం

Arun Chilukuri
Published on: 22 March 2021 2:52 PM IST
Telangana: కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్
X

తెలంగాణ ప్రభుత్వం (ఫైల్ ఫోటో)

Telangana: తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కుదించే ఆలోచన చేస్తోంది. దీనిపై ఇవాళ బీఏసీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో సభ్యులు ఒప్పుకుంటే రేపే ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

తెలంగాణ శాసన మండలిలో కరోనా కలకలం రేపింది. ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కరోనా బారిన పడ్డారు. శనివారం మండలికి హాజరై మాట్లాడిన పురాణం సతీష్‌‌ ఇవాళ హాజరుకాలేదు. అయితే ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మండలి సభ్యులు, సిబ్బందిలో కలవరం మొదలైంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story