Tamilisai: సూళ్లూరుపేట చెంగాళమ్మను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

*గవర్నర్‌ తమిళిసైకు స్వాగతం పలికిన అధికారులు.. *ఆలయ ఛైర్మన్ బాలచంద్రా రెడ్డి, ఈవో శ్రీనివాసులు రెడ్డి

Shilpa
Updated on: 4 Oct 2021 4:22 PM IST
Telangana Governor Tamilisai Soundararajan Visited Chengalamma Parameshwari Temple in Nellore Today 04 10 2021
X

 సూళ్లూరుపేట చెంగాళమ్మను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్(ఫైల్ ఫోటో) 

Tamilisai-Sri Chengalamma Temple: పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీహరికోట లో జరిగే ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ప్రారంభించడానికి వెళుతూ చెంగాలమ్మ ఆలయాన్ని దర్శించారు తమిళిసై. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ ఛైర్మన్ దువ్వూరు బాలచంద్రా రెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసులు రెడ్డి గవర్నర్‌కు ఆలయ మర్యాదలు అందించారు.

Shilpa

Shilpa

Next Story