ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, నూతన విధానాలపై సూచనలు అందించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 4 Nov 2025 6:00 PM IST
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, నూతన విధానాలపై సూచనలు అందించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. గత నెల 28న ఈ జీవో జారీ చేయగా, తాజాగా ఈ వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.

కమిటీ సభ్యులు:

ఛైర్మన్: సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్).

సభ్యులు:

ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ కంచ ఐలయ్య.

ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల కార్యదర్శులు.

ఉన్నత విద్యా మండలి ఛైర్మన్.

ఉన్నత విద్యా సంస్థల నుంచి ముగ్గురు ప్రతినిధులు.

కమిటీ బాధ్యతలు:

ఈ కమిటీ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పాలసీపై అధ్యయనం చేసి, ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వనుంది. ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించడం. విద్యా సంస్థలు చేసిన సూచనలు మరియు డిమాండ్‌లపై అధ్యయనం చేయడం. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం, ఈ కమిటీ తన నివేదికను మూడు నెలల్లోగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story