CM KCR Record: తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ముఖ్యమంత్రిగా.. సీఎం కేసీఆర్ సరసన సరికొత్త రికార్డ్.. అవతర‍‌ణ దినోత్సవాన అరుదైన ఘనత

Telangana formation Day CM KCR Record Has 9 Years As Chief Minister
x

CM KCR Record: తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ముఖ్యమంత్రిగా.. సీఎం కేసీఆర్ సరసన సరికొత్త రికార్డ్.. అవతర‍‌ణ దినోత్సవాన అరుదైన ఘనత

Highlights

CM KCR Record: సుదీర్ఘ కాలంగా తెలుగు రాష్ట్రాన్ని పాలించిన ఏకైక ముఖ్యమంత్రిగా.

CM KCR Record: నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం.. సవాళ్లకే సవాల్‌ విసిరే సమర్థత.. దార్శనికతకు ప్రతిరూపం ఆయన పరిపాలన. నవ తెలంగాణలో నయా అడుగులతో ఆయన వేసిన ప్రగతి బాట.. ప్రపంచం చూపు తిప్పేలా చేసింది. పట్టువదలని విక్రమార్కుడిలా.. అపర భగీరథుడిలా.. అతను వేసే ప్రతీ అడుగూ.. ఓటమి కూడా అతన్ని చూసి వెనుకడుగు వేసేలా చేసింది. ఆ పట్టుదలే ఇప్పుడు ఆయన్ను చరిత్ర పుటల్లో నిలుపుతోంది. సుదీర్ఘ కాలంగా తెలుగు రాష్ట్రాన్ని పాలించిన ఏకైక ముఖ్యమంత్రిగా.. ఇప్పటివరకు ఏ తెలుగు నాయకుడు అందుకోని సరికొత్త రికార్డును అందుకునేలా చేసింది.

2023 జూన్‌ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవమే కాదు.. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి చంద్రబాబు.. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు ఏపీ సీఎంగా 2014 జూన్ 8 నుంచి 2019 మే 23 వరకు కొనసాగారు. మొత్తంగా చంద్రబాబు 13 ఏళ్ల 247 రోజులు ఆ పదవిలో ఉన్నారు. మధ్యలో రాష్ట్ర విభజనతో ఆయన రికార్డును వేర్వేరుగా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఒకే తెలుగు రాష్ట్రంలో కంటిన్యూగా తొమ్మిదేళ్ల సీఎంగా కేసీఆర్ నిలవనున్నారు. వైఎస్సార్ 2004,2009 ఎన్నికల్లో వరుసగా గెలిచినా.. 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. వైఎస్సార్ అయిదు సంవత్సరాలు 111 రోజులు సీఎం పదవిలో కొనసాగారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఏడేండ్ల 221 రోజులు ముఖ్యమంత్రిగా పని చేసారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

2 జూన్‌ 2014- 2 జూన్‌ 2023

9 సంవత్సరాలు

నారా చంద్రబాబు నాయుడు

1 సెప్టెంబర్‌ 1995- 14 మే 2004

8 ఏళ్ల 256 రోజులు

కాసు బ్రహ్మానంద రెడ్డి

21 ఫిబ్రవరి 1964- 30 సెప్టెంబర్ 1971

7 ఏళ్ల 221 రోజులు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి

14 మే 2004- 2 సెప్టెంబర్‌ 2009

5 ఏళ్ల 111 రోజులు

ఎన్టీ రామారావు

16 సెప్టెంబర్‌ 1984- 3 డిసెంబర్ 1989

5 ఏళ్ల 73 రోజులు

Show Full Article
Print Article
Next Story
More Stories