బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు

Telangana Formation Day: బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

Arun Chilukuri
Updated on: 2 Jun 2024 8:00 AM IST
Telangana Formation Day Celebrations in Telangana Bhavan
X

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు

Telangana Formation Day: బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్ లో నేడు జరిగే కార్యక్రమానికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు, తదితర అంశాలపై ప్రసంగించనున్నారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రులు, అనాథ శరణాలయాల్లోని వారికి, మిఠాయిలు, పండ్లు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల అధ్యక్షులకు సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story