తెలంగాణ జానపద గాయకుడు ఓరుగంటి శేఖర్ అరెస్ట్

Telangana folk singer Oruganti Shekhar Arrest
x

తెలంగాణ జానపద గాయకుడు ఓరుగంటి శేఖర్ అరెస్ట్

Highlights

Oruganti Shekhar: శేఖర్‌‌ను కోర్టులో హాజరుపరిచినట్లు సమాచారం

Oruganti Shekhar: తెలంగాణ జానపద గాయకుడు ఓరుగంటి శేఖర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం శేఖర్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి..కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది. తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగాల బదిలీ వ్యవహారంలో రసమయికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు శేఖర్. దీంతో మానుకొండూర్ పోలీస్ స్టేషన్‌లో శేఖర్ పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది. ఇక శేఖర్ అరెస్ట్ పై ఆయన భార్య స్పందించారు. ప్రస్తుతం తన భర్త ఎక్కడున్నాడో తెలియదని.. పోలీసులు శేఖర్ ను ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories