Telangana Fights Corona: ఇక ఇంటికే కరోనా కిట్.. తెలంగాణా ప్రభుత్వ నిర్ణయం!

Telangana Fights Corona: ఇక ఇంటికే కరోనా కిట్.. తెలంగాణా ప్రభుత్వ నిర్ణయం!
x
Highlights

Telangana fights for corona : కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా...

Telangana fights for corona : కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితుల వద్దకే ఐసోలేషన్ కిట్ పంపాలని నిర్ణయించింది. ఆ సమయంలో చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లను సర్కారే ఉచితంగా సమకూర్చనుంది. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా బాధితులకు కిట్లను అందజేయాలని ఆదేశించారు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,224 ఉండగా.. యాక్టివ్ కేసులు 12,860 ఉన్నాయి. వీరిలో దాదాపు 10 వేల మంది ఇళ్లలోనే ఉండి చికిత్స పొందుతున్నారు.

కిట్‌లో ఏముంటాయి?

* శానిటైజర్లు, మాస్క్‌లు, గ్లౌజులు

* హైడ్రాక్సీక్లోరోక్విన్‌

* పారాసెటమాల్‌

* యాంటీ బయాటిక్స్‌

* విటమిన్‌ సి, ఇ, డి3 తదితరాలు

* లివోసెటిరిజైన్‌

* ఎసిడిటీని తగ్గించే మాత్రలు

* ఏం చేయాలి? ఏం చేయకూడదు? అని అవగాహన పెంపొందించే పుస్తకం

Show Full Article
Print Article
Next Story
More Stories