Telangana Election Results 2023: తొలి రెండు రౌండ్లలో హస్తం హవా

Telangana Election Results 2023: పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ కొనసాగిస్తున్న కాంగ్రెస్

Jyothi
Updated on: 3 Dec 2023 9:46 AM IST
Telangana Election Results 2023 Counting Live Updates
X

Telangana Election Results 2023: తొలి రెండు రౌండ్లలో హస్తం హవా 

Telangana Election Results 2023: తెలంగాణ వ్యాప్తంగా హస్తం హవా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్‌లో కనిపించిన హస్తం గాలి.. తొలి రెండు రౌండ్లలో కూడా వీస్తోంది. దాదాపుగా 55 స్థానాల్లో హస్తం ట్రెండ్ కొనసాగుతోంది. ఇటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఇటు హైదరాబాద్‌లో కారు జరు కొనసాగుతోంది. కీలక స్థానాల్లో కూడా కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది.

ఖమ్మంలో దాదాపుగా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ లీడ్‌లో కొనసాగుతోంది. ఖమ్మంతో పువ్వాడ వెనుకంజలో కనసాగుతుండగా.. తుమ్ముల ముందంజలో ఉన్నారు. ఇటు ఎవ్వరూ ఊహించని విధంగా సిరిసిల్లలో కూడా కాంగ్రెస్ దూసుకుపోతుంది. మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో మొదటి రౌండ్‌లో వెనుకంజలో ఉన్నారు. ఇటు కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో సైతం రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు.



Jyothi

Jyothi

Next Story