Telangana: పీఆర్సీ ప్రకటనకు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌

Telangana: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి పీఆర్సీ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

Arun Chilukuri
Published on: 21 March 2021 4:32 PM IST
Telangana: Election Commission Gives Green Signal for PRC Announcement
X

Telangana: పీఆర్సీ ప్రకటనకు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌

Telangana: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి పీఆర్సీ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. గతంలో పీఆర్సీ ఇస్తామని ప్రకటించినా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉండడంతో దానికి బ్రేక్ పడింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో పీఆర్సీ ప్రకటను అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది దాంతో పీఆర్సీ ప్రకటన చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే అనవసర ప్రచారం చేయరాదని.. ఎలాంటి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించకూడదని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాష్‌ కుమార్‌ లేఖ రాశారు.

మరోవైపు రేపు అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ పీఆర్సీపై కీలక ప్రకటన చేయనున్నారు. ఉద్యోగులకు 29శాతం పీఆర్సీ ఇచ్చే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలను ప్రగతిభవన్‌కు లంచ్‌కు ఆహ్వానించారు సీఎం కేసీఆర్‌. లంచ్‌ అనంతరం పీఆర్సీపై వారితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story