CEO Vikas Raj: పోలింగ్‌ రోజు సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు

CEO Vikas Raj: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలను పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు.

Arun Chilukuri
Updated on: 11 May 2024 8:15 PM IST
Telangana Election Commission CEO Vikas Raj Press Meet
X

CEO Vikas Raj: పోలింగ్‌ రోజు సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు

CEO Vikas Raj: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలను పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోకి రానుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలను పాటించాలన్నారు. ఎన్నికల పోలింగ్‌కు మొత్తం 3 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. పోలింగ్ జరిగే రోజు అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు ఉటాయని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story