Education Department on Private Schools: ప్రయివేటు పాఠశాలలపై విద్యాశాఖ కొరఢా

Education Department on Private Schools: ప్రయివేటు పాఠశాలలపై విద్యాశాఖ కొరఢా
x
Highlights

Education Department on Private Schools: తెలంగాణ విద్యాశాఖ అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై నిఘా పెట్టారు.

Education Department on Private Schools: తెలంగాణ విద్యాశాఖ అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై నిఘా పెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని గీతాంజలి స్కూల్‌, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ రెండు పాఠశాలలు మాత్రమే కాకుండా నగరంలోని మరో 15 పాఠశాలల్లో అధికారులు తనిఖీలు నిర్వహించినట్లుగా హైదరాబాద్ డీఈవో వెంకట నరసమ్మ తెలిపారు. అధికారులు చేసిన ఈ తనిఖీల్లో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, గీతాంజలి స్కూల్స్ యాజమాన్యం ప్రభుత్వం అమలు చేసిన నిబంధనల ఉల్లంఘంచినట్లుగా గుర్తించామని తెలిపారు. విద్యార్ధుల ట్యూషన్ ఫీజు, టెర్మె ఫీజులను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ని ఉల్లంఘిస్తున్నారు అని అన్నారు.

ఈ క్రమంలోనే ఈ రెండు పాఠశాలలకు అధికారులు నోటీసులు జారీచేశారని తెలిపారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పాఠశాలల యాజమాన్యాలు రికార్డులను పూర్తి స్థాయిలో ఇవ్వలేదని అన్నారు. స్కూల్స్ రికార్డులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత పాఠశాలల్లో ఏ ఉల్లంఘనలు జరిగాయో వెల్లడిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి అన్ని పత్రాలను ఇవ్వాల్సిన బాధ్యత ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories