తెలంగాణలో ప్రారంభమైన ఈసెట్

X
Highlights
TS ECET 2020: కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా వాయిదా పడిన వివిధ ప్రవేశ పరీక్షలు తెలంగాణలో సోమవారం ...
Arun Chilukuri31 Aug 2020 4:55 AM GMT
TS ECET 2020: కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా వాయిదా పడిన వివిధ ప్రవేశ పరీక్షలు తెలంగాణలో సోమవారం ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఏపీలో కలిపి 56 సెంటర్లలో ఈసెట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక బ్యాచ్, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరో బ్యాచ్‌కు పరీక్షలు జరుగుతాయి. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల భద్రతపై అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, ఉదయం పరీక్షకు 14,415 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం పరీక్షకు 13,600 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు పరీక్షలు నిర్వహిస్తున్న జేఎన్‌టీయూ అధికారులు తెలిపారు.
Web TitleTelangana ECET 2020 exam started
Next Story