నవంబర్, డిసెంబర్ నెలల్లో జీహెచ్​ఎంసీ ఎన్నికలు: పార్థసారధి

Arun Chilukuri
Published on: 7 Oct 2020 12:31 PM IST
నవంబర్, డిసెంబర్ నెలల్లో జీహెచ్​ఎంసీ ఎన్నికలు: పార్థసారధి
X

తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని పార్థసారధి తెలిపారు. తేదీ ఇంకా ఖరారు కాలేదని నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయని చెప్పారు. కాగా, వచ్చే ఫిబ్రవరి మొదటివారం జీహెచ్‌ఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. దీంతో ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. కొవిడ్-19 నేపథ్యంలో బ్యాలెట్‌ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story