DSC 2024 Counselling Postponed: కొత్త టీచర్లకు బిగ్ షాక్..పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా..త్వరలోనే పోస్టింగ్ కౌన్సెలింగ్ తేదీలు

Telangana DSC 2024 Counselling Postponed: తెలంగాణలో కొత్త టీచర్లకు బ్యాడ్ న్యూస్. డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది విద్యాశాఖ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 15 Oct 2024 11:12 AM IST
Telangana DSC 2024 Counselling Postponed
X

Telangana DSC 2024 Counselling Postponed

Telangana DSC 2024 Counselling Postponed: తెలంగాణలో కొత్త టీచర్లకు బ్యాడ్ న్యూస్. డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది విద్యాశాఖ.

తెలంగాణలో డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా వేసింది విద్యాశాఖ. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది విద్యాశాక. సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి పోస్టింగ్ కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న 10,006 మంది కొత్త టీచర్లకు మంగళవారం పోస్టింగ్స్ ఇవ్వున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

నూతన టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్ కు హాజరుకావాలని అధికారులు సూచించారు. అయితే కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది విద్యాశాఖ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story