మరో ఘనత సాధించిన తెలంగాణ వైద్యులు

మరో ఘనత సాధించిన తెలంగాణ వైద్యులు
x
Highlights

దేశంలోనే మొట్టమొదటి సారిగా కరోనా బారిన పడిన 32 ఏళ్ల ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి ఊపిరితిత్తుల మార్పిడిని చేసిన ఘనత హైదరాబాద్ వైద్యులకు దక్కింది....

దేశంలోనే మొట్టమొదటి సారిగా కరోనా బారిన పడిన 32 ఏళ్ల ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి ఊపిరితిత్తుల మార్పిడిని చేసిన ఘనత హైదరాబాద్ వైద్యులకు దక్కింది. నగరంలో ఉన్న ఓ ప్రయివేటు ఆస్పత్రి వైద్యులు ఓ సాహసాన్ని చేసారు. కరోనా బారిన పడిన వ్యక్తి ఇంతకు ముందే సార్కోయిడోసిస్‌ అనే ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. చందీఘడ్ కు చెందిన ఆ వ్యక్తికి డాక్టర్ సందీప్ అట్టావర్ నేతృత్వంలోని వైద్యుల బృందం శస్త్ర చికిత్స చేసినట్లు కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) విడుదల చేసింది. కాగా ఆ వ్యక్తి గత చేసిన శస్త్రచికిత్స ఫలించి కోలుకుని శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని వైద్యుల బృందం పేర్కొంది.

బాధితుడు సార్కోయిడోసిస్‌తో బాధపడుతున్న సమయంలోనే అతను కరోనాకు గురికావడంతో ఊపిరితిత్తుల మీద మరించ ప్రభావం చూపిందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో అతని పరిస్థితి క్షీణించిందని రెండు పిరితిత్తుల మార్పిడే అతని ప్రానాలు కాపాడేమార్గం అని పేర్కొన్నారు. గత ఎనిమిది వారాలుగా రోగికి వైద్యం అందించి చెన్నైలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఊపిరితిత్తులను శస్త్రచికిత్స చేసి మార్చారు. కోల్‌కతాలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఊపిరితిత్తులు ఇతనికి సరిగ్గా మ్యాచ్ కావడంతో వైద్యులు ఈ సాహసం చేయగలిగారని పేర్కొన్నారు. సకాలంలో ఊపిరితిత్తుల మార్పిడి చేయడంతో బాధితున్ని కాపాడగలిగాం అని వైద్యులు డాక్టర్ సందీప్ అట్టావర్ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories