కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తెలంగాణ డీజీపీ

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తెలంగాణ డీజీపీ
x

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తెలంగాణ డీజీపీ

Highlights

తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి కోవిడ్ టీకా వేయించుకున్నారు. వైద్యాధికారులు ఆయనకు టీకా వేశారు. తెలంగాణలో పోలీస్‌, రెవెన్యూ సిబ్బందికి టీకాల...

తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి కోవిడ్ టీకా వేయించుకున్నారు. వైద్యాధికారులు ఆయనకు టీకా వేశారు. తెలంగాణలో పోలీస్‌, రెవెన్యూ సిబ్బందికి టీకాల పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది. శనివారం మధ్యాహ్నం తిలక్‌నగర్‌ పీహెచ్‌సీకి వచ్చిన ఆయనకు వైద్య సిబ్బంది వ్యాక్సిన్‌ తొలి డోసు అందజేశారు. రాష్ట్రంలో పోలీసు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖలకు చెందిన 1,88,402 మంది సిబ్బందికి శనివారం నుంచి కొవిడ్‌ టీకాలు పంపిణీ చేయడానికి వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారంతో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకాల పంపిణీ ముగిసింది. ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది కలుపుకొని 1,93,485 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories