డీజీపీ మహేందర్‌రెడ్డికి అరుదైన గౌరవం

డీజీపీ మహేందర్‌రెడ్డికి అరుదైన గౌరవం
x
Highlights

దేశంలోని టాప్ 25 ఐపిఎస్ అధికారుల జాబితాలో తెలంగాణ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి ఎంపికయ్యారు.ఫేమ్ ఇండియా, పిఎస్‌యు వాచ్, ఆసియా పోస్ట్ ల ఆధ్వర్యంలో ఐపిఎస్...

దేశంలోని టాప్ 25 ఐపిఎస్ అధికారుల జాబితాలో తెలంగాణ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి ఎంపికయ్యారు.ఫేమ్ ఇండియా, పిఎస్‌యు వాచ్, ఆసియా పోస్ట్ ల ఆధ్వర్యంలో ఐపిఎస్ 200 మంది అధికారుల పనితీరు పై సర్వే చేశారు. నేరాలను నియంత్రించే వారి సామర్థ్యం,నిజాయితీ,శాంతి భద్రతలను మెరుగుపరిచే సామర్థ్యం, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సర్వే నిర్వహించారు. మంగళవారం సర్వే వివరాలను ప్రకటించారు.

ఇందులో 1984 బ్యాచ్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అర్వింద్‌ కుమార్‌ , రీసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌ (రా) చీఫ్‌ సమత్‌కుమార్‌ గోయల్, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ డీజీ ఎస్‌ఎస్‌ దేశ్వాల్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఆ తరువాత స్థానాల్లో వరుసగా సీఆర్‌పీఎఫ్‌ డీజీ మహేశ్వరి, ఎన్‌ఎస్‌జీ చీఫ్‌ అనూప్‌కుమార్‌సింగ్, ఢిల్లీ సీపీ ఎస్‌ఎన్‌ సిన్హా, బిహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే, తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి (8వ స్థానం) ఉన్నారు.

1986 ఐపీఎస్ బ్యాచ్‌‌‌‌కు చెందిన మహేందర్ రెడ్డిని నవంబర్ 12, 2017న రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించింది. మహేందర్ రెడ్డి గోదావరిఖని అసిస్టెంట్ ఎస్పీగా పని చేశారు. తరువాత నిజామాబాద్, కర్నూలు జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్ సీపీగా విధులు నిర్వహించారు. నేరాలను నియంత్రించే సామర్థ్యం, నిజాయితీ, ఫ్రెండ్లీ పోలీసింగ్ లో లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసే వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు పీఎస్ యూ వాచ్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ శుక్లా తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories