Bhatti Vikramarka: కాంట్రాక్టర్లు కాదు.. సంపద సృష్టికర్తలు..

Bhatti Vikramarka: ఇలాంటి వారిని ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత

Shekhar G
Published on: 28 Jan 2024 3:10 PM IST
Telangana Deputy Cm Bhatti Vikramarka Comments On Construction Sector
X

Bhatti Vikramarka: కాంట్రాక్టర్లు కాదు.. సంపద సృష్టికర్తలు..

Bhatti Vikramarka: బిల్డర్లను తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టర్లుగా చూడడం లేదని, సంపద సృష్టికర్తలుగా చూస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 31వ కన్వెన్షన్‌లో ఆయన మాట్లాడారు. దేశంలో సంపదను సృష్టించడంలో తెలుగు రాష్ట్రాల బిల్డర్లు కీలక భూమిక పోషిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత అన్నారాయన...

దేశంలో జరుగుతున్న నిర్మాణ రంగాల్లో తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్ల కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉందన్నారు భట్టి... 7వ దశకంలో మార్కెట్లో ఒక వెలుగు వెలిగిన నిర్మాణ రంగ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేడు కనిపించకుండా పోయాయన్నారు.

Shekhar G

Shekhar G

Next Story