Weekend Lockdown: వీకెండ్ లాక్‌డౌన్‌ను ప‌రిశీలిస్తాం - సోమేశ్ కుమార్

Telangana CS Somesh Kumar Clarifies on Imposition of Lockdown
x

సీఎస్ సోమేశ్ కుమార్

Highlights

Weekend Lockdown: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా తెలంగాణలో కాస్త అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటించారు.

Weekend Lockdown: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా తెలంగాణలో కాస్త అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్, ఆక్సిజన్, పడకలకు ఎలాంటి లోటూ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సోమేశ్ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌ వ్యాప్తి నివారణకు వైద్యులు, సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని.. ఇది మంచి పరిణామమన్నారు.

కొన్ని రోజులుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయని, ప్రతి ఆస్పత్రిలో పడకలతో పాటు ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ తమకు ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ ఉండ‌ద‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. హైకోర్టు సూచ‌నల్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని, ఆ మేర‌కు వీకెండ్ లాక్‌డౌన్ అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని సీఎస్ స్ప‌ష్టం చేశారు. పూర్తి స్థాయి లాక్‌డౌన్ అవ‌స‌ర‌మైన‌ప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories