Top
logo

కలెక్టర్లతో ‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన‌ సీఎస్

కలెక్టర్లతో ‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన‌ సీఎస్
X
Highlights

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బుధవారం జిల్లాల కలెక్టర్లతో...

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బుధవారం జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తున్న సమావేశంలో ధరణి పోర్టల్‌తో పాటు వ్యవసాయేతర భూముల వివరాలను ఆన్‌లైన్‌లో చేర్చే ప్రక్రియ, రిజిస్ట్రేషన్లు చేయడానికి అదనంగా తహసీల్దార్‌ కార్యాలయానికి ఏయే మౌలిక సదుపాయాలు, రిజిస్ట్రేషన్ల సన్నాహకాలు ఇతర విషయాలపై జిల్లాల వారీగా ఆరా తీయడంతోపాటు తగిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఆస్తులు, వ్యవసాయేతర భూములు ఇతర వివరాలను ఆన్‌లైన్‌లో చేర్చి, డేటాను నవీకరించడానికి అదనపు కలెక్టర్లను నోడల్‌ అధికారులుగా నియమించనున్నారు. ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే రైతు వేదికల నిర్మాణం, వీధివ్యాపారులు, ఎల్ఆర్ఎస్‌, వైకుంఠధామాల నిర్మాణం, కస్టమ్స్‌ మిల్లింగ్‌పై సమీక్షించనున్నారు.

ఇకపోతే కొత్త రెవెన్యూచట్టం అమలులో భాగంగా తీసుకురానున్న 'ధరణి' పోర్టల్‌ రూపకల్పనపై మంగళవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మండల పంచాయతీ అధికారుల (ఎంపీడీవో)తో, జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవో) సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. దీంతో సీఎస్‌ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.

Web TitleTelangana Cs conducted Video Conference With Collectors
Next Story